![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -323 లో.. కృష్ణ తన ఆలోచనలని నందుతో చెప్తుంటే భవాని వింటుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ తన చిన్నాన్నని కలవడానికి వెళ్తుంటే మురారి వచ్చి నేను వస్తానని అంటాడు. మురారి వస్తే నిజం తెలిసిపోయి డిస్టబ్ అయిపోతాడని అనుకొని.. వద్దు సర్ నేను హాస్పిటల్ కీ వెళ్తున్నానని చెప్పి కృష్ణ వెళ్ళిపోతుంది. అదంతా పై నుండి భవాని చూస్తుంటుంది.
ఆ తర్వాత మురారి అన్న మాటలు భవాని గుర్తుచేసుకుంటుంది. అప్పుడే భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. నేను తప్ప ఇంట్లో మీ మాట ఎవరు వింటున్నారు? మీ కూతురు అల్లుడు కూడా వినట్లేదని ముకుంద అనగానే.. అవును అందరు కూడా వాళ్ళు కలవాలని అనుకుంటున్నారు. మనం కూడా వాళ్ళ ఇష్టాన్ని గౌరవిద్దాం. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం మారదని భవాని చెప్పగానే.. ఏంటా నిర్ణయమని ముకుంద టెన్షన్ పడుతుంది.. ఇప్పుడు చెప్పను కృష్ణని బ్రేక్ ఫాస్ట్ కి పిలిచాను. అక్కడే అందరికి చెప్తానని భవాని చెప్తుంది. ఇంకా కృష్ణ రాలేదు. కృష్ణ లేకుండా అసలు ఉండలేకపోతున్నానని మురారి అనుకుంటాడు. అదే సమయంలో.. ఆ కృష్ణ నేనేం ప్లాన్ చేసిన ఫెయిల్ చేస్తుందని ముకుంద డిస్సపాయింట్ అవుతుంది. ముకుంద జీన్స్ టీ షర్ట్ వేసుకొని మురారిని ఇంప్రెస్ చెయ్యాలని అనుకుంటుంది. ముకుందని అలా చుసిన మధు.. నువ్వు ఏ డ్రెస్, అడ్రస్ మార్చిన మురారీని మార్చలేవని ముకుందతో అంటాడు.
మరొక వైపు గౌతమ్, నందు, మధు, రేవతి కలిసి కృష్ణ మురారి గురించి మాట్లాడుకుంటారు. అసలు పెద్దమ్మ కృష్ణని ఎందుకు బ్రేక్ ఫాస్ట్ కి పిలిచింది. కృష్ణ తినే ఫుడ్ లో ఏదైనా కలిపి రెండు రోజులు లేవకుండా చేసి ఆ తర్వాత మురారి ముకుంద లని అమెరికా పంపించాలని అనుకుంటుందా అని మధు అనగానే.. మధుపై రేవతి కోప్పడుతుంది.
మరొకవైపు కృష్ణకి గుర్తుకు చేసుకుంటూ మురారి ఉంటాడు. అప్పుడే ముకుంద టీ షర్ట్ లో రావడం చూసిన మురారి పట్టించుకోనట్టే ఉంటాడు. పైగా తన ముందు కూడా కృష్ణ గురించి మాట్లాడేసరికి ముకుందకి కోపం వస్తుంది. ఆ తర్వాత నా డ్రెస్ గురించి ఏం చెప్పలేదని ముకుంద అనగానే.. నీకు చీరనే సెట్ అవుతుంది. ముందు వెళ్లి ఈ అవతారం మార్చుకోమని మురారి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |